పనిమనిషికి కృష్ణం రాజు ఏ బహుమతి ఇచ్చాడో తెలుసా..?

పనిమనిషికి కృష్ణం రాజు ఏ బహుమతి ఇచ్చాడో తెలుసా..?

ఇండస్ట్రీలో రెబెల్ స్టార్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కృష్ణం రాజు..తన ఇంట్లో 25 ఏళ్లు గా పనిచేస్తున్న పనిమనిషి కి మరచిపోలేని బహుమతి ఇచ్చి వార్తల్లో నిలిచారు. గ‌త 25 ఏళ్లుగా పద్మ అనే మహిళ కృష్ణం రాజు ఇంట్లో ప‌ని చేస్తుంది. ఈ క్ర‌మంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు.. 25 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ అంటూ ఆమె చేత కేక్ కట్ చేయించారు.అనంత‌రం కృష్ణం రాజు స‌తీమ‌ణి శ్యామ‌లా దేవి ఆమెకు గోల్డ్ చైన్ బ‌హుమ‌తిగా అందించింది. ఇందుకు సంబంధించిన ఫొటోల‌ను ప్రభాస్ సోదరి ప్రసీద సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.

ఇక కృష్ణం రాజు విషయానికి వస్తే.. 1970, 1980లలో 183 తెలుగు సినిమాలలో నటించాడు. ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించాడు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్‌సభ ఎన్నికలలో కాకినాడ లోకసభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఆ తరువాత 13 వ లోక్‌సభకు కూడా నరసాపురం లోకసభ నియోజకవర్గం నుంచి ఎన్నికై అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు. మార్చి 2009లో భారతీయ జనతా పార్టీని వీడి ప్రజారాజ్యం పార్టీలో చేరినాడు. తరువాత జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత బిజెపి పార్టీ కి మద్దతు ఇస్తూ వస్తున్నాడు. చివ‌ర‌గా అనుష్క, అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రమదేవి’లో గణపతి దేవుడిగా కనిపించి అలరించారు. త్వ‌ర‌లో విడుద‌ల కానున్న రాధే శ్యామ్ చిత్రంలోను కృష్ణం రాజు న‌టించాడ‌ని స‌మాచారం.