మనదేశంలోనే కరోనాను తగ్గించే ఔషధం

ఫార్మా దిగ్గజం ‘గ్లెన్‌మార్క్‌’ తయారీ

Favipiravir tablets-

ముంబయి: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశంలో కొత్త ఔషధం రెడీ అయ్యింది.. దేశంలోనే ప్రముఖ ఫార్మాసంస్థ ముంబయిలోని ‘గ్లెన్‌మార్క్‌’ ఈ ఔషధాన్ని ఆవిష్కరించినట్టు పేర్కొంది.

ఫాబిప్లూ బ్రాండ్‌ పేరిట ఈ ఔషధాన్ని మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు శుక్రవారం భారత ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అనుమతులను పొందినట్టు పేర్కొంది..

దేశవ్యాప్తంగా అన్నిచోట్లా సాధ్యమైంత త్వరగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావటానికి తాము కేంద్రంతో కలిసి పనిచేస్తునట్టు వెల్లడించింది.

ఫవిపిరవిర్‌, ఉమిఫెనోవిర్‌ అనే రెండు యాంటీ వైరస్‌ ఔషధాలపై అధ్యయనం చేసిన సంస్థ ఫవిపిరవిర్‌ ఔషధం కరోనా స్వల్ప, మధ్యస్థ లక్షణాలతో బాధపడుతున్నవారిపై బాగా పనిచేస్తుందని పేర్కొంది.

ఈమేరకు సంస్థ చైర్మన్‌ గ్లెన్‌ సల్దన్హా పేర్కొన్నారు. ఒక్కో మాత్ర ధర రూ.103గా తెలిపారు. వైద్యుల ప్రిస్కిప్షన్‌ ఆధారంగానే ఈ ఔషధాన్ని విక్రయించనున్నట్టు తెలిపారు..

తొలిరోజున 1800 ఎంజి మాత్రలు రెండు వేసుకోవాలని, ఆ తర్వాత వరుసగా 14రోజులపాటు 800 ఎంజి మాత్రలను రోజుకు రెండుసార్లుగా వాడాలని పేర్కొన్నారు. కరోనాపైఔ ఫాబిప్లూ తొలి ఓరల్‌ ఔషధమని సంస్థ పేర్కొంది.. దేశంలో ఎన్నడూ లేనిపరిస్థితి ఏర్పడిందని, దేశ ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో ఈ అనుమతులు లభించాయని సంస్థ పేర్కొంది..

క్లినికల్‌ ట్రయల్స్‌లో ఫాబిప్లూ కోవిడ్‌ రోగులపై ప్రయోగించినపుడు సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు..

కరోనా లక్షణాలు స్వల్ప, మధ్యస్థాయిలో ఉన్న వారు, డయాబెటిక్‌, గుండెజబ్బు వ్యాధిగ్రస్థులు కూడా ఈ ఔషధాన్ని వినియోగించుకోవచ్చని, నాలుగురోజుల్లో వైరల్‌ ప్రభావం తగ్గిస్తుందని సంస్థ పేర్కొంది..

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/