మాస్క్‌లు వైరస్‌ వ్యాప్తిని ఎంత వరకు అడ్డుకోగలవు?

ఆరోగ్య భాగ్యం

corona mask
corona mask

కరోనాని వ్యాక్సిన్‌ కంట్రోల్‌ చేయగలుగుతుందా? వైరస్‌ని కంట్రోల్‌ లేదా నివారణ కలిగించే విధంగా వాక్సిన్‌ కనుగొనడం కష్టం.

జలుబు లక్షణానికి సంబంధించిన కరోనా వైరస్‌లు నాలుగు ఉన్నాయి. కోవిదో 19 ఐనోవదని, వాక్సిన్‌ వచ్చినా కరోనా పోదని అమెరికాకు చెందిన ఎపిడమాలజిస్టులు అంటున్నారు. నెక్ట్స్‌ ఫేజ్‌లో ఇది మరింత తీవ్రతరం కానుందని వారు చెప్పుతున్నారు.

షికాగో యూనివర్సిటీకి చెందిన ఎపిడమాలజిస్టు సారాకోబే హెచ్‌ఐవి, చికెన్‌ఫాక్స్‌లా స్వైన్‌ఫ్లూ లా ఇది మన మధ్యనే ఉంటుంది. ఇన్ని రకాల వైరస్‌ ఇన్ఫెక్షన్స్‌ని ఎలా ఎదుర్కొన్నామో అలాగే కరోనా ఉన్నా మనం జాగ్రత్తగా ఎలా బతకాలన్నది ముఖ్యమని తెలిపారు. మనుషుల నుంచి మనుషులకు సోకే లక్షణం ఉండడమే కరోనా వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమవ్ఞతుంది. ఇది పెద్ద ఎన్‌సిఒవి కరోనా సమూహానికి చెందింది. ఈ

వైరస్‌లలో జలుబు వంటి చిన్న అనారోగ్య సమస్యల నుంచి సార్స్‌, మెర్స్‌ వంటి తీవ్రమైన శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయి. కరోనావైరస్‌లు చాలా వరకు జంతువ్ఞలపై ప్రభావం చూపుతాయి. కాని ఏ జంతువునుంచి వ్యాపిస్తుంది అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని ఎపిడెమిక్స్‌ లీడ్‌ డాక్టర్‌ జోసీ గోల్డిండ్‌ చెప్పారు.

తాజాగా ప్రపంచమంతట విజృంభిస్తున్న కరోనా వైరస్‌ మనుషులపై తీవ్ర ప్రభావం చూపడం వల్ల వ్యాక్సిన్‌ తయారీలో అనేక అసమానతలు చోటు చేసుకుంటున్నాయి. వాక్సిన్‌ ఎంత వరకు సమర్ధవంతంగా వైరస్‌ని, దాని వ్యాప్తిని ఎదుర్కొంటున్నది అనుమానస్పదమే అని చెప్పాలి. ఎంతవరకు అందరికీ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుందనేది కూడా చెప్పలేము.


రైలు, బస్సు ప్రయాణాలు చేయవచ్చా?: ఇది ప్రయాణంలో ఎంత సమయం గడుపుతున్నాం. పరిశుభ్రత మీద ఆధారపడి ఉంటుంది. రద్దీగా ఉన్నప్పుడు మెట్రో రైళ్లు, బస్సులు ఎక్కువ మారాల్సి రాకుండా నేరుగా ఒకే దానిలో వెళ్లడం మంచిదని బ్రిటన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ హెల్త్‌కి చెందిన డాక్టర్‌ లారాగోస్క్‌ చెప్పారు.

రోగికి రెండు మీటర్ల దూర పరిధిలో 15 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఉన్నా, రోగి తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్లు ఉపరితాల్ని తాకినా తిరిగి వాటితో కళ్లు, ముక్కు, నోరు తాకినపుడు శరీరంలోకి చేరుతాయి.

మాస్క్‌లు వైరస్‌ వ్యాప్తిని ఎంత వరకు అడ్డుకోగలవు? :

1919లొ స్పానిష్‌ ఫ్లూ తర్వాతనే ప్రజల్లో మాస్క్‌ల వాడకం మొదలైందని చెప్పవచ్చు. గాల్లో ఉపరితలాలపై ఉన్న వైరస్‌లు, బాక్టీరియా వల్ల మాస్క్‌లు కొంత వరకు రక్షణ కల్పిస్తాయి.

ఎందుకంటే ఇవి వదులుగా ఉండడం వల్ల గాలి ఫిల్టర్‌ సరిగా లేకపోవడం, కళ్లని కవర్‌ చేయలేకపోవడం, మాస్క్‌ని చేతులతో మాటి మాటికీ పైకి, కిందకి కదిలించడం, రోజు మాస్కుల్ని శుభ్రం చేయకపోవడం వల్ల కూడా సరైన ఫలితం ఉండదని లండన్‌ విశ్వవిద్యాయలంలోని సెయింట్‌జార్ట్‌ వైద్యశాలకు చెందిన డాక్టర్‌ డేవిడ్‌ క్యారింగ్‌టన్‌ తెలిపారు.

కరోనా వైరస్‌ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?

ప్రతి వెయ్యి కేసుల్లో 5 – 40 మంది మరణించే ఆస్కారం . వెయ్యి మందిలో 9 మంది చనిపోయే ఆస్కారం ఉంది. అయితే ఇది బాధితుల వయసు, సెక్స్‌, ఆరోగ్యస్థితి, వారు నివసించే ప్రాంతంలో ఉండే ఆరోగ్యస్థితి, వారు నివసించే ప్రాంతంలో ఉండే ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని పరిశోధనకులు భావిస్తున్నారు.

వైరస్‌ సోకిన లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడు సొంతవైద్యం చేసుకోవడం జరుగతోంది. చాలామంది డాక్టర్లని సంప్రదించకపోవడం, ఇన్ఫెక్షన్‌ నుండి కోలుకోవడానికి, ఇతర కాంప్లికేషన్స్‌తో (ఆస్త్మా, న్యూమోనియా, గుండె జబ్బులు) చనిపోవడానికి మందులు, సైడ్‌ ఎఫెక్ట్స్‌ వల్ల చనిపోవడానికి సమయం పడుతుంది.

ఎందుకంటే వైరస్‌ అందరిపైనా ఒకే విధంగా ప్రభావం చూపడం లేదు. 60 సంవత్సరాలు పై బడ్డ వారిలో మరణాల రేటు పదింతలు ఎక్కువగా ఉంది. 30 సంవత్సరాల లోపు వారిలో చాలా తక్కువగా ఉంది. స్త్రీలతో పోలిస్తే మగవరిలో మరణాల రేటు కొంచెం ఎక్కువగా ఉంది.

కరోనా వైరస్‌లో జన్యు పరివర్తన వల్ల అది మనుష్యుల్లో ఎదిగేందుకు వీలుగా వైరస్‌ తనను తాను మార్చుకోవడం వల్లనే ఇలాంటి తీవ్ర పరిస్థితి ఏర్పడిందని ప్రొఫెసర్‌ ఈస్టన్‌ చెప్పారు.

దాని ప్రభావం మనుష్యులకు సంక్రమించినపుడు, దాన్ని ఎదుర్కొనే శక్తి రోగనిరోధక వ్యవస్థకు లేకపోవడం ముఖ్యకారణమని తెలుస్తున్నది. ఏదైనా వైరస్‌కాని బాక్టీరియా కాని, క్రిమికారక రోగం కానీ సోకిన తొలి వ్యక్తిని ‘పేషంట్‌ జీరోగా పరిగణిస్తారు.

వైరస్‌ లేదా వ్యాధి సోకిన వ్యక్తిని వైరస్‌ లేదా వ్యాధి సోకిన వ్యక్తిని పరీక్షించడం ద్వారా వైరస్‌ పుట్టుక, వ్యాప్తి, లక్షణాలు, వ్యాధి తీవ్రత తెలుస్తుంది.

దీని ద్వారా వైరస్‌ వ్యాప్తి అరికట్టడానికి, భవిష్యత్‌లో ఎదురయ్యే విపత్కర పరిణామాల్ని ఎదుర్కొవడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలుస్తుంది.

  • డాక్టర్‌. కె.ఉమాదేవి,తిరుపతి

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/