ఏపీలో కులగణనకు కేబినెట్‌ ఆమోదం

Cabinet approves caste census in AP

అమరావతి: సీఎం జగన్‌ అధ్యక్షతన ఏపీ మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రభుత్వ శాఖలు సమర్పించిన 38 ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో పరిశ్రమల ఏర్పాటు, 6,790 ఉన్నత పాఠశాలల్లో నైపుణ్యాభివృద్ధి కోసం కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. కర్నూలులో నేషనల్‌ లా వర్సిటీకి మరో 100 ఎకరాల భూ కేటాయింపు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయించే ప్రతిపాదన, ఏపీలో పరిశ్రమలకు కొత్త భూకేటాయింపు విధానానికి అంగీకారం తెలిపింది. అలాగే ఏపీలో కుల గణన, సామాజిక, ఆర్థిక అంశాల గణన చేపట్టేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.