ఇప్పటికైనా ధాన్యం కొనుగోలు చేసి రైతుల‌కు న్యాయం చేయాలి : ఉత్త‌మ్

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు చేసి రైతుల‌కు న్యాయం చేయాలని తెలంగాణ మాజీ పీసీసీ చీఫ్‌, ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆయ‌న మాట్లాడుతూ… ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్‌ఎస్‌కు చెప్పాలని హితవు పలికారు. అంతేకాకుండా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం గోనె సంచులు కూడా కొనలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు జరిపి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/