ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

Dharmapuri Arvind
Dharmapuri Arvind

నిజామాబాద్ బిజెపి ఎంపీ అరవింద్ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేసీఆర్‌ కూతురు ఎమ్మెల్సీ కవితపై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా టిఆర్ఎస్ కార్యకర్తలు శుక్రవారం అరవింద్ ఇంటి ఫై దాడి చేసారు. ఆయన ఇంట్లోకి చొరబడి ఫర్నిచర్ ధ్వసం చేసారు. పార్కింగ్ లో ఉన్న కార్ అద్దాలు ధ్వసం చేసారు. ఇంట్లో నానా బీబత్సం చేసారు. టిఆర్ఎస్ కార్య కర్తలు దాడి చేస్తున్న సమయంలో అరవింద్ ఇంట్లో లేరు.

ఇక గురువారం అరవింద్ ఏమని మాట్లాడారంటే …సొంత కూతురు, ఎమ్మెల్యేలను అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ వచ్చారని విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ భ్రష్టు పట్టడానికి కారణం కొడుకు, బిడ్డలే అని అన్నారు. తెలంగాణను సీఎం కేసీఆర్ స్వయంగా అంధకారంలోకి నెట్టి వేస్తున్నారని ఆరోపించారు. పవర్ సెక్టార్‌ను గాలికొదిలేసి పాలకులు గంజా, డ్రగ్స్ పార్టీల్లో బిజీగా ఉన్నారన్నారు. బిడ్డ బ్యూటీ పార్లర్ మీద సంపాదించిన డబ్బుతో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తున్నట్లు కేసీఆర్ ఫీలవుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్, ఆమ్ ఆద్మీ పార్టీలు లిక్కర్ స్కాం పార్టనర్స్ అని ఆరోపించారు.

కవిత ను కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నించారని.., అందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు ఫోన్ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చే కార్యక్రమానికి ఆమెకు ఆహ్వానం అందలేదని.., దీంతో కవిత అలిగి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేసిందని అర్వింద్ ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్.. సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ చనిపోయినప్పుడు కవితను తన వెంటే తొడ్కొని యూపీకి వెళ్లారన్నారు. తన కూతురు తన వెంటే ఉందని చెప్పేందుకు కేసీఆర్‌ను ఆమెను యూపీకి తీసుకెళ్లారని చెప్పారు. కవితను తమ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం లేదని.., రాష్ట్రాన్ని కల్వకుంట్ల కుటంబం భ్రష్టుపట్టించదని ఆయన మండిపడ్డారు. అసలు కవితను బీజేపీలో చేర్చుకునేందుకు ఎవరు ప్రయత్నించారో చెప్పాలని అరవింద్ డిమాండ్ చేశారు.