నందమూరి అభిమానులకు జగన్ షాక్ ఇస్తే..కేసీఆర్ మాత్రం సంతోషం నింపారు

చిత్రసీమ విషయంలో ఏపీ లో జగన్ కఠినంగా వ్యవహరిస్తుంటే..తెలంగాణ లో మాత్రం కేసీఆర్ సంతోషం నింపుతున్నారు. ఏపీలో బెనిఫిట్‌ షోస్ లేకుండా చేయడమే కాకుండా టికెట్స్ ధరను కూడా భారీగా తగ్గించాడు జగన్..కానీ తెలంగాణ లో మాత్రం బెనిఫిట్‌ షోస్ కు అనుమతి ఇవ్వడమే కాదు టికెట్ ధరలు పెంచుకునేందుకు కూడా ఓకే చెప్పింది. తాజాగా సినిమా టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్లకు హైకోర్టు అనుమతిచ్చింది. టికెట్ల ధరలపై అధికారులు తుది నిర్ణయం తీసుకునే వరకు యాజమాన్యాలు కోరిన ధరలతో థియేటర్లను నిర్వహించేందుకు అనుమతివ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అఖండ, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప, భీమ్లానాయక్‌ వంటి భారీ బడ్జెట్‌ సినిమాలకు … ఒక్కో టికెట్‌పై కనీసం రూ.50 పెంచాలని థియేటర్ల యాజమాన్యాలు భావిస్తున్నాయి.

అలాగే రేపు బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం రేపు విడుదల కాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో రెండు థియేటర్లు లలో బెనిఫిట్‌ షోస్ కు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూకట్‌పల్లిలోని మల్లికార్జున, భ్రమరాంబ థియేటర్లకు బెనిఫిట్‌ షోలు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. ఈ స్పెషల్‌ షోలకు టికెట్‌ రేట్లను పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ముందుగా ‘అఖండ’ చిత్రం ఈ థియేటర్లలోనే ప్రదర్శితంకానుంది. ఉదయం 4: 30 ని.లకు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. దీంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.