చేనేత కార్మికులకు సీఎం కెసిఆర్ శుభాకాంక్షలు

హైదరాబాద్ : చేనేత కార్మికులకు సీఎం కేసీఆర్ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ చేనేత ప్రత్యేక కళ భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తున్నదన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో చేనేత రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చి అభివృద్ది చేసుకుంటూ వస్తున్నదన్నారు. మారిన సాంకేతిక యుగంలో పవర్ లూమ్‌లు నడుపుతూ వాటిలో పనిచేస్తున్న నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతున్నదన్నారు. ప్రభుత్వ దార్శనికతతో, మంత్రి కేటీఆర్ కార్యదక్షతతో, గత పాలనలో కునారిల్లిన రాష్ట్ర చేనేత రంగాన్ని అనతి కాలంలోనే పునరుజ్జీవింప చేసుకున్నామన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను గుర్తించి, ఆదరించి ప్రోత్సహించే కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు.

కాగా, నేతన్నల సంక్షేమం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని, బతుకమ్మ చీరలు తదితర కార్యక్రమాలతో నేతన్నలకు చేతినిండా పని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎగ్జిబిషన్లు, ఫ్యాషన్ షోలు నిర్వహిస్తూ చేనేతలకు ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. రైతు బీమా మాదిరి చేనతలకు కూడా త్వరలో బీమా సౌకర్యాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు. చేనేతలకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి గుర్తు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/