చక్కటి బంధానికి కావాలి నమ్మకం

జీవన వికాసం

Belief needs a good bond
Belief needs a good bond

కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో సత్సంబంధాలు ఉండాలంటే చక్కటి భావ వ్యక్తీకరణ అవసరం. అది లేనప్పుడు కలతలు, అపోహలు ఇలా ఎన్నో అనర్థాలు ఎదురవవచ్చు.

దాన్ని అలవాటు చేసుకోవాలంటే ఎదుటివారికి ఏమైనా చెప్పడానికి ముందు ఆ విషయాన్ని పూర్తిగా నమ్మగలగాలి. అప్పుడే దాన్ని ఎదుటివారూ అర్ధం చేసుకోగలుగుతారు. అలాకాకుండా ఏదో ఒకటి చెప్పాలనుకుంటే సరిగా వ్యక్తీకరించలేరు.

దాంతో అవతలివారి నమ్మకాన్ని కోల్పోతారు. చక్కగా మాట్లాడాలంటే ముందు అంతే బాగా ఎదుటివారు చెప్పేది వినగలగాలి. అప్పుడే వారి భావోద్వేగాలు అర్ధమవుతాయి. దానికి తగినట్లుగా స్పందించగలుగుతారు.

ఇలా చేసినప్పుడు బంధం బలపడుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు పొడిపొడిగా చెప్పడం వల్ల ఇతరులు వినడానికి ఇసక్తి చూపించకపోవచ్చు.

చెప్పాలనుకున్న అంశం ఆధారంగా ఉదాహరణలు, సందర్భా లను ప్రస్తావించవచ్చు. ఇవి వారికి భలే చెబుతున్నారే అనే భావన కలిగిస్తాయి.

ఎంత చక్కగా మాట్లాడినా ఇతరులను కించపరిచేలా వ్యంగాస్త్రాలు విసరడం మంచిది కాదు. ఎదుటివారి బాధల్ని గతం తాలూకు గాయాల్ని గుర్తుచేస్తూ మాట్లాడవద్దు.

అవన్నీ వారిని నొప్పిస్తాయి. మన మధ్య వచ్చే చర్చల్లో కొన్ని అంశాలు ఎంతకీ తెగవు.

అలాంటప్పుడు తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న ధోరణిలో వాదించవద్దు. అక్కడికక్కడ దానికి ముగింపు పలకడం మేలు. అలా చేస్తే ఎవరూ నొచ్చుకోరు.

కొన్నిసార్లు ఏదయినా మాట్లాడుతు న్నప్పుడు, మరేదయినా విషయాన్ని చర్చిస్తున్నప్పుడు తెలియకుండానే ఎదుటివారిని బాధపెట్టవచ్చు.

అలాంటి పరిస్థితి ఎదురైన ప్పుడు పట్టించుకోనట్లు వదిలేయకుండా క్షమాపణ చెప్పగలగాలి.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/