నయవంచనే కాంగ్రెస్ నైజం – BRS

Congress

TS: కాంట్రాక్టు స్టాఫ్ నర్సులను తొలగించడంపై BRS విమర్శలు గుప్పించింది. నయవంచనే కాంగ్రెస్ నైజమని, మోసం చేయడం ఆ పార్టీకి అలవాటని మండిపడింది. ‘మాకు ఉద్యోగాలు వస్తాయని కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఉన్న ఉద్యోగాలు తీసేశారు. కరోనా సమయంలో తండ్రిని కోల్పోయినప్పటికీ 24 గంటలు సర్వీస్ చేస్తే ఉద్యోగం నుంచి తీసేశారు. దీంతో రోడ్డున పడ్డాం’ అంటూ పలువురు నర్సులు కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను ట్విట్టర్ లో షేర్ చేసింది.