అల్లు అర్జున్ ను ఘోరంగా అవమానించిన కన్నడ మీడియా

స్టలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు లోనే కాదు ఇతర భాషల్లోనూ విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. బన్నీ నటించిన ప్రతి చిత్రం ఇతర భాషల్లో డబ్ అవుతూ అలరిస్తుంటాయి. ఈ క్రమంలో తాజాగా బన్నీ నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా గా పలు భాషల్లో ఈ నెల 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో అల్లు అర్జున్ చిత్ర ప్రమోషన్ లలో పాల్గొంటున్నాడు. తాజాగా బెంగళూరులో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. 11.15కి ప్రెస్‌మీట్‌ ఉండగా, మూవీ టీం1.15కి అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో అక్కడి మీడియా చిత్ర యూనిట్ ఫై ఫైర్ అయ్యారు.

ఉదయం 11.15 నిమిషాలకు ప్రెస్ మీట్ అని చెప్పి.. మీరు మధ్యాహ్నం 1.15 నిమిషాలకు ఎలా వస్తారని, ఇక్కడ మీడియాను మీరు అవమానించినట్లే అని ఒక రిపోర్టర్ కొద్దిగా ఘాటుగానే ప్రశ్నించాడు.. ఇక దీనికి బన్నీ సమాధానం చెప్తూ ” ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ ఉందని నాకు ఇందాకే తెలిసింది.. తెలిసిన వెంటనే ప్రైవేట్ జెట్ లో బయల్దేరాను.. మధ్యలో పొగమంచు కప్పేయడంతో ల్యాండింగ్ ఇష్యూ వలన కొద్దిగా లేట్ అయ్యింది.. మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే క్షమించండి.. ఇది ఎవరిని హార్ట్ చేయాలనీ చేయలేదు.. సారీ.. సారీ అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సారీ చెప్తే మనిషి పెరుగుతాడు కానీ తగ్గడు అని తనదైన స్టైల్ ల్లో బన్నీ తెలిపిన విధానం ఆకట్టుకొంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక బన్నీ సారీ చెప్పడంపై బన్నీ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే ఇండస్ట్రీ హీరో కాబట్టి ఇలా అడగగలుగుతున్నారు.. అదే మీ కన్నడ హీరోలను ఇలా నిలదీయగలరా..? అని అభిమానులు అక్కడి మీడియా ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.