దేశంలో కొత్తగా 8,439 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 93,733

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 8,439 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 9,525 మంది మహమ్మారి నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా… 195 మంది మృతి చెందారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3,40,89,137 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 4,73,952 మంది మృతి చెందారు.

ఇక ఇప్పటివరకు 129.5 కోట్ల డోసుల వ్యాక్సిన్ వేశారు. ప్రస్తుతం దేశంలో 93,733 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ భయాలు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఒమిక్రాన్ రూపంలో దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/