నాలుగో టెస్టు కు బుమ్రా దూరం

గాయంతో వైదొలగాల్సిన పరిస్థితి

Bumrah injury and had to withdraw before the Fourth Test
Bumrah

Sydney: ఆస్ట్రేలియా -భారత్ మధ్య  జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ లో ఇప్పటి వరకూ మూడు టెస్టులు పూర్తయ్యాయి. సిరీస్ లో తొలి టెస్టును మినహాయిస్తే మిగిలిన రెండు టెస్టులలో అద్భుతంగా రాణించిన సిరీస్ ను 1-1 తో సమ ఉజ్జీగా నిలిపిన భారత్ కు నాలుగో టెస్టు ముందు మాత్రం వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి.

మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొని మ్యాచ్ డ్రా కావడానికి ప్రధాన కారకుల్లో ఒకడైన హనుమ విహారి తొడ కండరాలు పట్టేయడంతో నాలుగో టెస్టుకు దూరం కాగా, తాజాగా భారత్ బౌలర్ బుమ్రా సైతం నాలుగో టెస్టుకు దూరం అయ్యాడు.

ఈ నెల 15 నుంచి బ్రిస్బేన్ లో జరిగే నాలుగో టెస్టుకు ముందు బుమ్రా గాయంతో వైదొలగాల్సిన పరిస్థితి వచ్చింది. పొత్తి కడుపు కండర గాయంతో బాధపడుతున్న బుమ్రాను నాలుగో టెస్టుకు దూరం పెట్టాలని టీమ్ ఇండియా మేనేజ్ మెంట్ భావిస్తోంది.

తాజా ‘నాడి’ వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health1/