మంచుతో వాహనదారులకు ముప్పు
మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి

East Godavari District” తూర్పుగోదావరి జిల్లాను మంచు కమ్మేస్తున్నది. మంచు వాహనదారులకు ముప్పుగా పరిణమించింది. రాత్రి పది గంటల నుంచి ఉయం 8 గంటల వరకూ మంచు కమ్మేసి దారి కనిపించకుండా చేస్తున్నది.
మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. విపరీతంగా కురుస్తున్న మంచు కారణంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి.
ఇప్పటికే ఉత్తరకోస్తా, దక్షిణ, తీర జిల్లాలకు ‘ఎల్లో వార్నింగ్’ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఉదయం 8గంటల వరకు రహదారులు కన్పించకుండా పొగ మంచు కమ్మేస్తున్నది
తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/