కాంగ్రెస్ – వైసీపీ పార్టీ పొత్తుపై విజయసాయి కామెంట్స్

Vijayasai Reddy
Vijayasai Reddy

కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే వరుసగా సోనియా..రాహుల్ తో భేటీ అయినా ప్రశాంత్..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. మే 7న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ప్రశాంత్‌ కిషోర్‌ సూచించారని..అందులో ఆంధ్రప్రదేశ్‌లో వైస్సార్సీపీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్‌ పార్టీకి ప్రశాంత్‌ కిషోర్‌ సూచించినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల ఫై వైసీపీ ఎంపీ విజయసాయి స్పందించారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని వెల్లడించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తుపై పార్టీ వైఖరి ఎలా ఉండనుందో సూచనప్రాయంగా తెలియజేశారు. అలాగే వైసీపీ అధిష్టానం ఉత్తరాంధ్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించడం ఫై కూడా విజయసాయి స్పందించారు. పార్టీ ఏ పదవి అప్పగిస్తే ఆ పదవిని నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు.
తాను గతంలో అనేక పదవులు చేపట్టానని, చిత్తశుద్ధితో పనిచేయడమే తనకు తెలుసని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే వరుసగా సోనియా..రాహుల్ తో భేటీ అయినా ప్రశాంత్..ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. మే 7న ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తుంది. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ప్రశాంత్‌ కిషోర్‌ సూచించారని..అందులో ఆంధ్రప్రదేశ్‌లో వైస్సార్సీపీ తో పొత్తు పెట్టుకొని ఎన్నికల బరిలో దిగాలని కాంగ్రెస్‌ పార్టీకి ప్రశాంత్‌ కిషోర్‌ సూచించినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తల ఫై వైసీపీ ఎంపీ విజయసాయి స్పందించారు.

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీకి వైసీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. సీఎం జగన్ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని వెల్లడించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో పొత్తుపై పార్టీ వైఖరి ఎలా ఉండనుందో సూచనప్రాయంగా తెలియజేశారు. అలాగే వైసీపీ అధిష్టానం ఉత్తరాంధ్ర ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పించడం ఫై కూడా విజయసాయి స్పందించారు. పార్టీ ఏ పదవి అప్పగిస్తే ఆ పదవిని నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. తాను గతంలో అనేక పదవులు చేపట్టానని, చిత్తశుద్ధితో పనిచేయడమే తనకు తెలుసని అన్నారు.