ఢిల్లీలోని ఇజ్రాయెల్ అంబసీ ఎదుట పేలుడు
ఐఈడీ ఉన్న బ్యాగును పేవ్ మెంట్ పై ఉంచి దుండగులు వెళ్లిపోయారని పోలీసులు వెల్లడి

New Delhi: డిల్లీలోని ఇజ్రాయెల్ అంబసీ ఎదుట పేలుడు సంభవించింది. ఎంబసీ భవనం ఉన్న పేవ్ మెంట్ పై ఈ పేలుడు సంభవించిందని చెప్పారు. ఈ పేలుడు కారణంగా అక్కడ పార్క్ చేసున్న నాలుగు కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి.
ఎవరూ గాయపడలేదు. ఐఈడీ ఉన్న బ్యాగును పేవ్ మెంట్ పై ఉంచి దుండగులు వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. పేలుడు సంభవించిన ప్రాంతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖులు పాల్గొంటున్న ‘బీటింగ్ ది రిట్రీట్ సెరమొనీ’ జరుగుతున్న ప్రాంతానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది.
పేలుడు నేపథ్యంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది.
తాజా కెరీర్ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/