చిరంజీవి ఆచార్య మూవీ సెట్‌కు అగ్ని ప్రమాదం..

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కలయికలో ఆచార్య మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ మూవీ మొదటి రోజు మొదటి ఆట తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో నిర్మాతలకు , డిస్ట్రబ్యూటర్స్ కు భారీ నష్టాలే మిగిలాయి. ఇదిలా ఉంటె ఈ సినిమా లో వేసిన ధర్మస్థలి సెట్ తాజాగా మంటల్లో కాలిపోయింది. ఈ అగ్ని ప్రమాదాన్ని కొందరు వీడియో తీశారు. మెయిన్ ఎంట్రన్స్ వద్ద కూర్చొని ఎవరో సిగరెట్ కాల్చారని, ఆ తర్వాత కొద్ది నిమిషాలకే సెట్‌లో మంటలు చెలరేగాయని దీన్ని రికార్డ్ చేసిన వ్యక్తులు మాట్లాడుకుంటుండటం వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో వినబడుతోంది.

మొత్తానికి మంటలు భారీగానే చెలరేగి సెట్ మొత్తం కాలిపోతున్నట్లు వీడియో ద్వారా స్పష్టమవుతోంది. అగ్ని ప్రమాదం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది సెట్ కు చేరుకొని మంటలను అదుపుచేసే ప్రక్రియ మొదలుపెట్టారు. కానీ అప్పటికే సెట్ పూర్తిగా కాలిపోయింది. హైదరాబాద్ శివార్లలోని కోకాపేటలో సుమారు 20 ఎకరాల్లో ఈ సెట్ వేశారు. సురేష్ సెల్వరాజన్ నిర్మించిన ఈ సెట్‌కు దాదాపు రూ. 23 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేష్ కాంబినేషన్‌లో ‘భోళా శంకర్’ అనే చిత్రం చేస్తున్నారు. చిరంజీవి కి జోడిగా తమన్నా నటిస్తుండగా , చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే జరుగుతోంది. ప్రధాన తారాగణం అంతా షూటింగ్‌లో \పాల్గొంటున్నారు