రాష్ట్ర ఆస్తుల వివరాలతో బిఆర్‌ఎస్‌ ఓ డాక్యుమెంట్‌ విడుదల

bts-has-released-a-document-with-telangana assets

హైదరాబాద్: రాష్ట్ర ఆస్తుల వివరాలతో బిఆర్‌ఎస్‌ ఓ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది. పదేళ్లలో సృష్టించిన తెలంగాణ ఆస్తుల పేరిట ఈ డాక్యుమెంట్‌ను రూపొందించింది. కెసిఆర్‌ హయాంలో సృష్టించిన ఆస్తుల జాబితాను అందులో పొందుపరిచింది. కాగా ఈరోజు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులుపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శ్వేతపత్రం కంటే ముందే డాక్యుమెంట్‌ను బిఆర్‌ఎస్‌ విడుదల చేసింది. అప్పులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేలా బిఆర్‌ఎస్‌ వ్యూహం కనిపిస్తోంది.