ఇంట్లో వారు దోశ కు డబ్బులు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఈరోజుల్లో చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకుంటూ వారి కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. మొబైల్ కొనివ్వలేదని , గేమ్స్ ఆడనివ్వడం లేదని , స్నేహితులతో బయటకు పంపడం లేదని ఇలా చిన్న చిన్న వాటికే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రతి చిన్న సమస్య వచ్చిన ఆత్మ హత్యే శరణ్యమని నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా తిరుపతి లో దోశ కు డబ్బులు ఇవ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ తలారి వారిపల్లికి చెందిన సాయి కిరణ్.. దోశ తినేందుకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వలేదని గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు గుర్రప్పకుంట లో దూకి… సాయి కిరణ్‌ మృత దేహాన్ని బయటకు తీశారు. దోశ డబ్బులేనా..లేక మరో కారణంతో ఆత్మ హత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలికియూ దర్యాప్తు చేస్తున్నారు.