బీఎస్ఎన్ఎల్ దీపావళి ధమాకా ఆఫర్

ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ దీపావళి సందర్బంగా ధమాకా ఆఫర్ అందించింది. రూ.251, రూ.299, రూ.398 ప్లాన్లతో రీఛార్జ్ చేయడం వల్ల అదనంగా డేటా అందిస్తున్నట్లు తెలిపింది. మరిన్ని ఆఫర్స్ చుస్తే..

రూ.251 ప్లాన్ ద్వారా రీఛార్జ్ చేసుకుంటే అదనంగా 3 జీబీ డేటా , ఇది 28 రోజుల పాటు వ్యాలిడిటీ ఉంటుంది. రూ.299 ప్లాన్‌తో అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. దీని రీఛార్జ్ మాత్రం సెల్ఫ్ కేర్ యాప్ లో చేయాల్సి ఉంటుంది. యాప్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్‌ల్లో బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్ అందుబాటులో ఉండనుంది. ఇది 30 రోజుల వ్యాలిడిటీ లభించనుంది. ఇందులో రోజుకు అన్‌లిమిటెడ్ లోకల్ కాల్స్, 100 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి.

రూ.398తో రీఛార్జ్ చేస్తే.. 120 జీబీ డేటా అందించనున్నారు. అదనంగా 3 జీబీ డేటా లభించనుంది. అంతేకాకుండా.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు లభించనుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు ఉండనుంది. అలాగే గత ఏడాది రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ ఇండియాలో లాంచ్ చేసింది. ఇవి అందరికీ అందుబాటులో ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే ఖరీదైన ప్లాన్ ధర రూ.1,198 కాగా, అతి తక్కువ చవకైన ప్లాన్ ధర రూ.439గా ఉంది. రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లాంగ్ టర్మ్ ప్లాన్లు కావాలనుకునేవారికి బాగా పనిచేస్తుంది. ఇందులో నెలకు 3 జీబీ డేటా, 300 నిమిషాల కాలింగ్, 30 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి.

రూ.439 ప్రీపెయిడ్ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులుగా ఉంది. ఈ ప్లాన్ లో అన్‌లిమిడెట్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు లభించనున్నాయి. ఈ ప్లాన్ లో డేటా ఉండదు.

రూ.398 ప్లాన్ కే అన్‌లిమిటెడ్ డేటాను అందించనుంది. అంతేకాకుండా.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు ఉంటాయి. ఈ ప్లాన్ కేవలం వ్యాలిడిటీ 30 రోజులు ఉంటుంది.