పంజాబ్‌లో మరో పాకిస్థాన్ డ్రోన్ చొరబాటు

చండీగఢ్: పంజాబ్ బార్డర్ లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ పటిష్ట నిఘా పెట్టి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నా.. పాకిస్థాన్ వైపు నుంచి అనుమానిత డ్రోన్ కెమెరాలు వస్తూనే ఉన్నాయి. ఈనెల రోజుల వ్యవధిలో మూడు అనుమానిత డ్రోన్లను భారత జవాన్లు పట్టుకున్నారు.
నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఫిరోజ్ పూర్ సెక్టార్ లో పాకిస్థాన్ నుంచి మరో డ్రోన్ పంజాబ్ బార్డర్ లోకి వచ్చింది. ఇది గమనించిన BSF బలగాలు కాల్పులు జరిపాయి. ఈరోజు ఉదయం వ్యవసాయ పొలాల్లో పడిన డ్రోన్ ను బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకుని.. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/