మణిపూర్ లో హింస, అత్యాచారాలు ..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కనిపించడం లేదా..? – దాసోజు శ్రవణ్

మణిపూర్ లో రోజు రోజుకు హింసలు , విధ్వంసకాండలు, మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతుంటే..కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం అవేమి పట్టించుకోకుండా తెలంగాణలో నీచ రాజకీయ నాటకాలకు పాల్పడుతున్నారంటూ బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. గత రెండు నెలలుగా మణిపూర్ లో హింసాత్మక ఘటనలు, లూటీలు, దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులతో అక్కడి ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. ఇప్పటి వరకూ 140 మందికిపై ప్రాణాలు కోల్పోయారు. హింసను కట్టడి చేయడానికి ప్రభుత్వ చేపట్టిన చర్యలు అంతగా ఫలించడం లేదు. మైతీలను ఎస్జీ జాబితాలో చేర్చడానికి అక్కడ బీజేపీ ప్రభుత్వం అనుకూలంగా వ్యవహరిస్తుండటమే ఈ దాడులకు కారణం. దీనిని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఇలాంటి తరుణంలో అమానవీయ ఘటన ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చగా మారింది. ఇద్దరు కుకీ మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగించడం, సామూహిక అత్యాచారానికి పాల్పడడం ఇప్పుడు సభ్యసమాజం తలదించుకునేలా చేసింది. రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. మే 4న జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ ఘటనపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, మణిపూర్‌ పోలీసులు మాత్రం ఈ ఘటన కాంగ్‌పోక్సిలో జరగలేదని, వేరే ప్రాంతంలో చోటుచేసుకుందని చెబుతున్నారు. ఈ ఘటన పట్ల బిఆర్ఎస్ శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా మణిపూర్ లో ఇంతదారుణం జరుగుతుంటే..కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాత్రం ఇవేమి సంబంధం లేనట్లు తెలంగాణలో నీచ రాజకీయ నాటకాలకు పాల్పడుతున్నారని బిఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఈరోజు బాటాసింగారంలో డబుల్ బెడ్ రూమ్ఇళ్ల పరిశీలనకు కేంద్ర మంత్రి , బిజెపి రాష్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. అయితే పోలీసులు బిజెపి నేతలను ఎక్కడిక్కడే అడ్డుకున్నారు. కిషన్ రెడ్డి ని సైతం అడ్డుకోవడం తో ఆయన రోడ్ పైనే కూర్చుని నిరసన వ్యక్తం చేసారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ యుద్ధం మెదలు పెట్టారని… బీజేపీ యుద్ధన్ని ముగిస్తుందని స్పష్టం చేశారు. ఆట మెదలైందని, ఆట ఎలా ఆడాలో బీజేపీకి తెలుసునని ఆయన అన్నారు.