మ‌రో ఇద్ద‌రు ఎంపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన బిఆర్ఎస్

brs

న్యూఢిల్లీః లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బిఆర్ఎస్ పార్టీ ‌తన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉంది. ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించ‌గా.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్య‌ర్థుల‌ను ఖరారు చేసింది. ఇందులో కీలకమైన మెదక్ స్థానం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రామి రెడ్డిని ఖరారు చేశారు‌. ఇక నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇటీవలే బీఎస్పీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు అవకాశం ఇచ్చింది.

రాష్ట్రంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలు ఉండగా ఇప్పటి వరకు బిఆర్ఎస్ 13 స్థానాలకు అభ్యర్థులను ప్ర‌క‌టించింది. మిగిలిన నాలుగు స్థానాలకు కూడా త్వరలోనే అభ్యర్థులను ఖ‌రారు చేసే అవకాశం ఉంది. ఇందులో కీలకమైన నల్గొండ, భువనగిరి ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ రెండు స్థానాల నుంచి పలువురు నేతలు టికెట్లు ఆశిస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇప్పటి వరకు బిఆర్ఎస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితా..

చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాబాద్
వరంగల్ (ఎస్సీ )-డాక్టర్ కడియం కావ్య
మల్కాజ్ గిరి – రాగిడి లక్ష్మారెడ్డి
ఆదిలాబాద్ – ఆత్రం సక్కు
జహీరాబాద్ -గాలి అనిల్ కుమార్
నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి(ఎస్సీ) – కొప్పుల ఈశ్వర్
మహబూబ్‌ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి
ఖమ్మం -నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్(ఎస్టీ)- మాలోత్ కవిత
మెదక్ – వెంకట్రామిరెడ్డి
నాగర్ కర్నూలు – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్