లోయలోకి దూసుకెళ్లిన బ్రదర్ అనిల్‌కుమార్ కారు
![brother anil kumar](https://www.vaartha.com/wp-content/uploads/2020/02/brother-anil-kumar.jpg)
విజయవాడ: బ్రదర్ అనిల్‌కుమార్‌కు పెను ప్రమాదం తప్పిపోయింది. ఆయన కారు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బ్రదర్ అనిల్ కుమార్ కారు జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్‌పోస్ట్ వద్దకు రాగానే అదుపు తప్పి ఫుట్ పాత్ నుంచి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. దీంతో బ్రదర్ అనిల్‌తోపాటు ఆయన డ్రైవర్, గన్‌మెన్‌కు స్వల్ప గాయాాలయ్యాయి. సమాచారం అందుకున్న ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను హుటాహుటిన ఘటనా ప్రదేశానికి వెళ్లి బ్రదర్ అనిల్‌తో పాటు ఆయన డ్రైవర్, గన్‌మన్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం బ్రదర్ అనిల్ తన పర్యటనకు వెళ్లిపోయారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/