లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్ మ్యూజిక్ రిలీజ్

లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్ మ్యూజిక్ ను రిలీజ్ చేసింది లైగర్ టీం . విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్ట్ చేస్తున్న చిత్రం లైగ‌ర్. ఈ చిత్రాన్ని ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ఒక బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు మేజ‌ర్ హైలైట్ ఏంటంటే..ఈ మూవీ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో నటించడం.

ఆగస్టు 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో సినిమా తాలూకా ప్రమోషన్ ను స్పీడ్ చేసారు చిత్ర యూనిట్. ఇప్పటికే స్టిల్స్ , టీజర్ , సాంగ్స్ వంటివి విడుదల చేసి సినిమా ఫై అంచనాలు పెంచేసిన మేకర్స్..తాజాగా లైగ‌ర్ యాటిట్యూడ్ సాంగ్ పేరిట అధికారిక మ్యూజిక్ వీడియోను విడుద‌ల చేశారు. సునీల్ కశ్యప్ స్వరపరిచిన ఈ పాట‌ను విజ‌య్ స్వయంగా ఆల‌పించాడు. పూరి సాహిత్యం అందించాడు. లైగర్ చిత్రంలో విజయ్ యాటిట్యూడ్ ఎలా ఉండబోతోందో ఈ పాట ద్వారా అర్థం అవుతోంది. ‘వాట్ లగా దేంగే’ అంటూ ఒక నిమిషం 26 సెకన్ల నిడివి ఉన్న ఈ పాట విడుదలైన క్షణాల్లోనే యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఈ సాంగ్ ఫై మీరు ఓ లుక్ వెయ్యండి.

YouTube video