ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో బ్రిటన్‌ ప్రధాని

మరింత క్షీణించిన ఆరోగ్యం

boris johnson
boris johnson

లండన్‌: బ్రిటన్‌ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గత నెల 26 న కరోనా బారిన పడగా.. కొద్ది రోజులపాటు తన వ్యక్తిగత వైద్యుల సహయంతో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందారు. కాని కరోనా లక్షణాలు తగ్గక పోవడంతో నిన్న ఆసుపత్రిలో చేరినట్లు ప్రధాని ఒక వీడియో సందేశం ద్వారా వెల్లడించారు. కాగా నిన్న సాయంత్రానికి, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో ఉంచి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. బ్రిటన్‌ ప్రధాని ఆసుపత్రిలో చేరడంతో యూకే విదేశాంగ శాఖ కార్యదర్శి డోమినిక్‌ రాబ్‌ కరోనా సంబందిత వ్యవహరాలను చూసుకుంటున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/