దేవాలయాల్లో క్వారంటైన్‌ కేంద్రాలా…?

వ్యతిరేకించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ

kanna laxmi narayana
kanna laxmi narayana

అమరావతి: రాష్ట్రంలోని శ్రీకాళహస్తీ, కాణిపాకం వంటి పుణ్య క్షేత్రాలలో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నా ప్రభత్వ నిర్ణయంను వ్యతిరేకిస్తున్నట్లు ఏపి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్రంలో ఎక్కడా చోటు లేనట్లు, కోట్లాది మంది ఆరాధించే దేవాలయాల్లో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు శోచనీయమని అన్నారు. దీనిపై ఏపి సిఎం జగన్‌కు కన్నా లేఖ రాశారు. కాగా దేవాలయాల్లో క్వారంటైన్‌ కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి : https://www.vaartha.com/telangana/