కర్నూలు జిల్లాలో 74 కు చేరిన కరోనా కేసులు
పలు ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించిన జిల్లా ఎస్పీ

కర్నూలు: కర్నూలు జిల్లాలో రోజురోజుకు పరిస్ధితి మారిపోతుంది. మొన్నటివరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్ కేసుతో ఉన్న జిల్లా, నేడు 74 కరోనా పాజిటివ్ కేసులతో రాష్ట్రంలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదు అయిన జిల్లాగా మారింది. ఇందులో 73 కేసులు కేవలం మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారివే ఉండడం గమనార్హం. కర్నూలు నగరంలో 20, నంద్యాలలో 23, ఆత్మకూరులో 4,పాణ్యం 4, బనగానపల్లె 4, నందికోట్కూరు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాఓ కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో, కరోనా కేసులు ఎక్కువగా ఉన్నా ప్రాంతాలలొ లాక్‌డౌన్ ను మరింత కఠినం చేసున్నట్లు, ఆ ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/