రష్యాలో హోండా విక్రయాలకు బ్రేక్‌!

అధికారిక ప్రకటన విడుదల

Break Honda sales in Russia!

టోక్యో: జపాన్‌కు చెందిన ప్రముఖ వాహనాలు, బైక్‌ల తయారీ సంస్థ హోండా, సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రష్యాలో కార్ల తయారీ విక్రయాలను నిలిపివేయాలని నిర్ణయించుకుంది. దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. రష్యాలో తమ సంస్థకు చెందిన కార్ల అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

2022 జనవరి నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ ఏడాది కాలంలో ఇప్పటి వరకూ అందిన ఆర్డర్లను స్వీకరించడంతో పాటు, కొనుగోలుదారులకు కార్లను సరఫరా చేస్తామని స్పష్టం చేసింది. రష్యాలో తమ ఆధీకృత డీలర్లు ఎవరికీ కార్లను సరఫరా చేయబోమని వివరించింది.

కార్ల తయారీని నియంత్రించడంలో భాగంగా మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు హోండా మోటార్స్‌ కంపెనీ యాజమాన్యం తన ప్రకటనలో పేర్కొంది. రష్యన్‌ మార్కెట్‌లో ప్రస్తుతం కొనసాగుతోన్న తమ కంపెనీకి చెందిన మోటార్‌ సైకిళ్లు, పవర్‌ ఎక్విప్‌మెంట్ల విక్రయాలు మాత్రం యధాతథంగా ఉంటాయని వివరణ ఇచ్చింది.

ష్యాలో హోండా కంపెనీకి ఇప్పటి వరకు కార్ల తయారీ యూనిట్‌ లేదు. జపాన్‌కే చెందిన ఇతర వాహన తయారీ సంస్థలు టయోటా, నిస్సాన్‌లు రష్యన్‌ మార్కెట్‌ను ఆధారంగా చేసుకుని, అక్కడ తయారీ యూనిట్లను నెలకొల్పాయి. కిందటి నెలలో టయోటా, నిస్సాన్‌లకు చెందిన 79వాహనాలు రష్యాలో అమ్ముడుపోయాయి. గత ఏడాదితో పోలిస్తే, రష్యన్‌ మార్కెట్‌లో వాహనాల అమ్మకాల్లో 50శాతం క్షీణత కనిపించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు 15శాతం మేర తగ్గాయి. 1383 వాహనాలు మాత్రమే విక్రయం అయ్యాయి.

గత ఏడాది ఇదే కాలానికి 1.3మిలియన్ల మేర వాహనాలను రష్యన్లు కొనుగోలు చేశారు. కరోనా వైరస్‌ సృష్టించిన సంక్షోభ పరిస్థితులు, ఆర్థిక స్థితిగతుల వల్ల రష్యన్‌ మార్కెట్లో వాహనాల విక్రయాలు దిగజారాయి. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రష్యన్‌ మార్కెట్లో వాహనాల విక్రయాలను నిలిపివేయాలని హోండా సంస్థ యాజమాన్యం నిర్ణయించినట్లు చెబుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/