ప్రభాస్‌తో ఫిదా చేస్తానంటోన్న బ్యూటీ

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ చిత్రం ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్రభాస్ అండ్ టీమ్ ప్రయత్ని్స్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసబెట్టి ఓకే చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో ఓ సినిమాను ఓకే చేశాడు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ఆదిపురుష్ అనే సినిమాలో కూడా నటించేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.

అయితే ఈ సినిమాలు పట్టాలెక్కక ముందే తన నెక్ట్స్ మూవీని కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో చేసేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. ఈ సినిమాకు సలార్ అనే టైటిల్‌ను పెట్టిన చిత్ర యూనిట్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామల్లో ఎవరిని తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ ఈ సినిమాలో సౌత్ హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.

అందుకే తెలుగు, తమిళ, మలయాళ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ సాయి పల్లవిని ఈ సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, ఆ పాత్రకు యాక్టింగ్ స్కోప్ ఎక్కువగా ఉండనుండటంతో సాయి పల్లవి అయితేనే బెస్ట్ అని చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ భావిస్తున్నాడు. మరి నిజంగానే సలార్ చిత్రంలో అందాల భామ సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తుందో లేదో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే.