కొత్త ఏడాదిలో ఆడి ఎ4 కొత్త వెర్షన్
ఇప్పటికే రూ.2 లక్షల టోకెన్ అడ్వాన్స్‌తో బుకింగ్స్ ప్రారంభం

న్యూఢిల్లీ: నూతన సంవత్సరం 2021లో లగ్జరీ కార్ల విభాగంలో ఆడి ఎ4 సెడాన్ మార్కెట్లో విడుదల కానుంది. దేశీయంగా ఇప్పటికే రూ.2 లక్షల టోకెన్ అడ్వాన్స్‌తో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఆడి డీలర్లు, అధికారిక వెబ్‌సైట్ ద్వారా బుకింగ్స్ మొదలయ్యాయి. జనవరి 5న ఆడి కొత్త ఎ4 సెడాన్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.

2 లీటర్ల పెట్రోల్ టిఎఫ్‌ఎస్‌ఐ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు వేరియంట్స్ రూ.42-48లక్షల ఎక్స్‌షోరూమ్ ధరలలో లభించనున్నట్లు ఆటో వర్గాలు తెలియచేశాయి. కొత్త ఇంటీరియర్, ఎక్స్‌్‌టీరియర్ డిజైన్లలో ఎ4 రూపొందింది. లెడ్ హెడ్‌ల్యాంప్స్, లెడ్‌టెయిల్ ల్యాంప్స్‌తో పాటు బంపర్‌ను సైతం అప్‌డేట్ చేసింది.

కేబిన్‌లో 10.1అంగుళాల ఇన్ఫోటెయిన్‌మెంట్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేసుకునేందుకు వీలయ్యే సీట్లు, 3 జోన్ క్లయిమేట్ కంట్రోల్, వర్చువల్ కాక్‌పిట్, యాంబియెంట్ లైటింగ్, వైర్‌లెస్ చార్జింగ్, సన్‌రూఫ్‌తో పాటు 8 ఎయిర్‌బ్యాగ్స్‌తో ఎ4 సెడాన్ వెలువడనున్నట్లు ఆటో రంగ నిపుణులు భావిస్తున్నారు.
ఈ కారు 7.3సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని అంచనా.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/