ధైర్యవంతులు రావాలి: పవన్
రాజమహేంద్రవరంలో ‘జనసేన’ ఆవిర్భావ దినోత్సవ సదస్సు

రాజమహేంద్రవరం: ఫిరంగి గుండెల్లో గుచ్చుకున్నా.. పిడు గులు పడ్డా నిలబడే యువతతో కూడిన థైర్య వంతులు దేశానికి, రాష్ట్రానికి కావాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
నాకు మంచి నటనాచాతుర్యంతో కూడిన భవిష్యత్తు ఉన్న ప్పటికీ ప్రజలకు సేవ చెయ్యాలనే సంకల్పంతో రాజకీయాన్ని ఎంచుకున్నానని జనసేన అధినేత పవన్కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
రాజమహేంద్రవరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం స్థానిక షెల్టాన్ హోట ల్లో ఏర్పాటు చేసిన సదస్సులో పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.
నిజజీవితం గురించి మాట్లాడితే నలుగురు నన్ను కొడతారేమో అన్న భయం అసలు నాకు లేనేలేదని పవన్కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.
అయితే నేను పార్టీని స్థాపించినప్పుడు కూడా నాతో ఎవరూ మేధావులు లేరన్నారు.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/