నేడు జగిత్యాల జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటన

kcr cabinet meeting updates
CM-KCR to tour Jagtial district today

హైదరాబాద్‌ః సిఎం కెసిఆర్‌ ఈరోజు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. ముందుగా జిల్లాలో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు సిఎం కెసిఆర్. అనంతరం జగిత్యాల మెడికల్ కాలేజీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తారు. ఆ తరువాత జిల్లా టిఆర్ఎస్ కార్యాలయం భవనాన్ని ప్రారంభించనున్నారు. అటుతరువాత మధ్యాహ్నం 3 గంటలకు జగిత్యాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి సభలో ఆయన ప్రసంగించనున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/