‘లైగర్‌’కు బాయ్‌కాట్‌ సెగ

బాయ్‌కాట్‌ ఇప్పుడు ఈ ట్యాగ్ బాలీవుడ్ ను కుదేల్ చేస్తుంది. ఇప్పటికే పలు సినిమాలను ఈ ట్యాగ్ తో బాయ్‌కాట్‌ చేసి ఆయా చిత్ర నిర్మాతలకు తీవ్ర నష్టాలు తీసుకురాగా..తాజాగా విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ కు కూడా తగిలింది. విజయ్‌ దేవరకొండ-పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో అనన్య పాండే హీరోయిన్ గా రూపొందిన ఈ సినిమా ఆగస్టు 25న పాన్‌ ఇండియా మూవీగా విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ప్రమోషన్స్ భారీ ఎత్తున జరపడం తో సినిమా ఫై అంచనాలు తారాస్థాయికి చేరాయి.

ఈ క్రమంలో లైగర్‌కు బాయ్‌కాట్‌ సెగ తగిలింది. దీనికి కరణ్‌జోహార్‌ ఒక కారణమైతే, విజయ్‌ దేవరకొండ యాటిట్యూడ్‌ మరో కారణంగా తెలుస్తుంది. పూరి కనెక్ట్స్‌తో కలిసి కరణ్‌ జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మించడంతో లైగర్‌ బాయ్‌కట్‌ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. ఇక మరోవైపు ఓ ఇంటర్వ్యూలో లాల్‌సింగ్‌ చడ్డా బాయ్‌కాట్‌ చేయడంపై విజయ్‌ స్పందిస్తూ.. ఇలా చేయడం వల్ల చాలామంది కార్మికులు నష్టపోతారని కామెంట్స్‌ చేసి అమీర్‌ఖాన్‌కు మద్దతు తెలపడంతో ట్రోలింగ్‌ స్టార్ట్‌ అయ్యింది. దీనికి తోడు ఓ ప్రెస్‌మీట్‌లో‌ విజయ్‌ దేవరకొండ టేబుల్ మీద కాళ్లు పెట్టి మీడియాకు ఆన్సర్‌ ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. ఈ కారణాలతో లైగర్‌ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottLigerఅనే ‍హ్యాష్‌ట్యాగ్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. మరి ఈ బాయ్‌కాట్‌ ఎఫెక్ట్ సినిమా ఫై ఎంత ప్రభావం చూపుతుందో చూడాలి.