రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు
అల్లోపతి వైద్యంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
మూడు వారాల్లోగా స్పందించాలని రాందేవ్‌కు ఆదేశం
Baba Ramdev
న్యూఢిల్లీ: యోగా గురు రాందేవ్ బాబాకు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అల్లోపతి వైద్యంపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఢిల్లీ వైద్యుల సంఘం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అక్కడితో ఆగక పతంజలి అభివృద్ధి చేసిన కొరోనిల్ కిట్‌తో కరోనాకు అడ్డుకట్ట వేయొచ్చంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొంది.
విచారించిన న్యాయస్థానం రాందేవ్ బాబాకు సమన్లు జారీ చేసింది. సమన్లకు మూడు వారాల్లోగా స్పందనను దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే, మున్ముందు ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా ఉండాలని రాందేవ్ బాబాకు చెప్పాలని ఆయన తరపు న్యాయవాదికి సూచించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/