లోకేశ్‌ పాదయాత్రను చూసి వైఎస్‌ఆర్‌సిపి భయపడుతోందిః బొండా

పాదయాత్రను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక

bonda umamaheswara rao
bonda-uma-fires-on-jagan

అమరావతిః నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను ఆపాలని ముఖ్యమంత్రి జగన్ ఒక పథకం ప్రకారం గొడవలు చేయిస్తున్నారని టిడిపి నేత బొండా ఉమా అన్నారు. పాదయాత్రపై జరుగుతున్న దాడులు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయని విమర్శించారు. లోకేశ్ పాదయాత్రకు వస్తున్న ప్రజా స్పందనను చూసి వైఎస్‌ఆర్‌సిపి భయపడుతోందని చెప్పారు. అందుకే పాదయాత్రపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రపై రాళ్ల దాడి చేసి, మళ్లీ వాలంటీర్లపైనే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర కొనసాగుతున్న ప్రాంతానికి వైఎస్‌ఆర్‌సిపి గూండాలను ఎలా పంపిస్తారని ప్రశ్నించారు. లోకేశ్ కు భద్రతను పెంచాలని డీజీపీకి ఎన్నో లేఖలు రాసినా ఆయన స్పందించలేదని విమర్శించారు. పాదయాత్రను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు.