గాజాలోని అల్ అహ్లీ హాస్పిటల్‌పై ఇజ్రాయెల్ బాంబు దాడి..500 మంది మృతి

గత కొద్దీ రోజులుగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య భారీ యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని ఆసుపత్రిపై వైమానిక దాడి చేయడంతో దాదాపు 500 మంది మృతి చెందారు. ఈ దాడిని ఇజ్రాయెల్ జరిపిన మారణహోమంగా హమాస్ అభివర్ణించింది. ఈ దాడిలో తమ ప్రమేయం లేదని ఇజ్రాయెల్ ఖండించింది. హమాస్ రాకెట్ మిస్ ఫైర్ కావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇజ్రాయెల్ పేర్కొంది.

సెంట్రల్ గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడి చేసిందని హమాస్ పేర్కొంది. ఈ ఆసుపత్రిని గాజా స్ట్రిప్‌లోని చివరి క్రైస్తవ ఆసుపత్రిగా అభివర్ణిస్తున్నారు. అల్ అహ్లీ అబ్రి బాప్టిస్ట్ హాస్పిటల్‌పై సాయంత్రం ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడి చేసిందని, ఇందులో 500 మందికి పైగా మరణించారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య జరిగిన గొడవల్లో, దాడుల్లో ఇదే పెద్దది. ఇక ఉత్తర గాజాలో దాడులు చేస్తాం…అక్కడ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అని చెప్పిన ఇజ్రాయెల్ దక్షిణ గాజాలో కూడా దాడులు చేస్తోంది. నిన్న జరిగిన దాడుల్లో దక్షిణ గాజాలో పదుల సంఖ్యలో పాలస్తీనావాసులు మరణించారు.