సోముకు పవన్ మాములు షాక్ ఇవ్వలేదుగా..

సోముకు పవన్ మాములు షాక్ ఇవ్వలేదుగా..

బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ఈరోజుతో ముగియనుంది. ఈ ఉప ఎన్నికకు తెలుగుదేశం , జనసేన పార్టీలు దూరంగా ఉన్నాయి. కానీ బిజెపి మాత్రం పోటీలో నిలిచింది. సెంటిమెంట్ ని గౌరవిస్తూ తమ పార్టీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నట్టు స్వయంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రకటించారు. కానీ బిజెపి నేత సోము మాత్రం బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నామని , బిజెపి కి పవన్ సపోర్ట్ ఇస్తున్నారని చెప్పి ప్రచారం మొదలుపెట్టారు.

వైసీపీ విజయం దాదాపు ఖరారైనప్పటికీ..రాష్ట్రంలో బీజేపీ పార్టీ కూడా ఉంది అని నిరూపించుకోడానికి కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకోడానికే నేతలు తాపత్రయం పడ్డారు. దానికోసం బాగానే ఖర్చు చేస్తున్నారు. గ్రామాల్లో చేరికలను ప్రోత్సహిస్తూ.. భారీగా నజరానాలు ముట్టజెబుతున్నారు. ఈ క్రమంలో పవన్ ప్రచారానికి వచ్చినా, కనీసం పవన్ స్టేట్ మెంట్ ఇచ్చినా కాస్తో కూస్తో ప్రయోజనం ఉంటుందని ఆశించారు. చివరి రోజు వరకూ అదే ఆశలో ఉన్నారు. కానీ పవన్ మాత్రం ప్రచారానికి రాలేదు సరికదా..కనీసం బిజెపి కి ఓటు వేయమని చెప్పలేదు. దీంతో బిజెపి షాక్ లో పడ్డారు.