షాక్ : వరల్డ్ వైడ్ గా నిలిచి పోయిన వాట్సాప్ , ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు

వరల్డ్ వైడ్ గా వాట్సాప్ , ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. సోమవారం రాత్రి దాదాపు 9 గంటల నుంచి నిలిచిపోయాయి. ప్రపంచంలో అత్యధిక ప్రాంతాల్లో ఈ సోషల్ మీడియా వేదికలు ‘ఔటేజ్’ అయినట్లు చాలా మంది యూజర్లు ట్విటర్‌లో తెలిపారు.
“క్షమించండి, ఏదో తప్పు జరిగింది. మేము దానిపై పని చేస్తున్నాము, వీలైనంత త్వరగా దాన్ని పరిష్కరిస్తాము” అని ఫేస్‌బుక్ వెబ్‌సైట్‌లో ఒక సందేశం ఉంచింది.
వాట్సాప్ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తూ ఒక మెసేజ్ చేసింది. కొంతమంది వాట్సాప్ ఉపయోగించలేక పోతున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది, సమస్యను పరిష్కరించి, సేవలను యధాతథంగా కొనసాగించేందుకు మేం కృషి చేస్తున్నామని, యూజర్లకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరుతున్నామని ఆ సందేశంలో పేర్కొంది.
ఫేస్‌బుక్‌కు భారతదేశంలో 41 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. వాట్సాప్‌ను అయితే 53 కోట్లకు పైగా యూజర్లు భారత్‌లో వినియోగించుకుంటున్నారు. 21 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్ ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం మెసెంజర్ కూడా చాలా మంది యూజర్లకు అందుబాటులో లేకుండా పోయింది. నిత్యం ఈ మూడింటిలో ఉండే యూజర్లంతా..ఒక్కసారిగా టెలిగ్రామ్ ను ఆశ్రయించారు. టెలిగ్రామ్ యాప్ లేనివాళ్లు అర్జెంట్ గా డౌన్ లోడ్ చేయడం ప్రారంభమైంది.