ఎమ్మెల్యే రాజాసింగ్ ను లేపేస్తం అంటూ ఫోన్ కాల్స్

బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు కాల్స్ వస్తున్నాయట. లేపేస్తం, చంపేస్తాం, బాంబ్ పెడతామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని రాజాసింగ్ ఆరోపణలు చేసారు. తనకు వచ్చిన కాల్స్ వివరాలను డిజిపికి ఫిర్యాదు చేసినట్లు రాజాసింగ్ తెలిపారు.. డీజీపీ ఏం చేస్తారో చూడాలని… గతంలో కూడా దేశ విదేశాల నుంచి పాకిస్తాన్ , దుబాయ్, ఇదే మాదిరిగా బెదిరింపు కాల్స్ వస్తే డిజిపికి ఫిర్యాదు చేశాను అప్పుడు పట్టించుకోలేదని రాజాసింగ్ ఆరోపించారు. రాజా సింగ్ కు గన్ లైసెన్స్ ఇవ్వండని సీఎం కేసీఆర్ చెప్పినా… డిజిపి ఇవ్వడంలేదన్నారు. తాను ఎమ్మెల్యే ను, బిజెపి ఫ్లోర్ లీడర్ ను అయినా డిజిపి గన్ లైసెన్స్ ఇవ్వడంలేదని మండిపడ్డారు. తనపై కేసులు ఉన్నాయని కేసులు ఉంటే గన్ లైసెన్స్ ఇవ్వలేమని చెప్పుకొచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు.