నా స్థాయి ఏంటో నిరూపించుకుంటాను

జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పవన కల్యాణ్‌ ప్రసంగం

Pawan Kalyan
Pawan Kalyan

రాజమండ్రి: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాజమండ్రిలో ఆ పార్టీ ముఖ్యనేతలందరూ సమావేశమయ్యారు. ఈసందర్భంగా పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ..’2014లో పార్టీ ప్రారంభించాం.. ఏడో ఏడాదిలోకి అడుగుపెడుతున్నాం.. ఈ సందర్భంగా ఓ విషయం చెప్పదలుచుకున్నాను. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తన స్థాయి చాలా తక్కువగా ఉంటుందని అప్పట్లో కొందరు అన్నారని  అన్నారు. నాతో సినిమా తీస్తే దాదాపు రూ.70 లక్షలతో మాత్రమే తీయొచ్చన్నారు. కోటి రూపాయల బడ్జెట్‌తో సినిమా తీస్తే చాలా గొప్ప అన్నారు. నా స్థాయికి పరిమితం చేశారు’ అని చెప్పారు.

‘కానీ, ఒకరి స్థాయి ఇంతే అని నేను నమ్మను. ఆ రోజున వాళ్ల మాటలకు ప్రభావితమై నా స్థాయి అంతేనని నేను కూడా నిర్ణయం తీసుకుంటే ఈ నాడు ఇంతమంది అభిమానాన్ని సొంతం చేసుకునే వాడిని కాదు. వాళ్ల మాటలను నమ్మి ఉంటే నిజంగానే నా స్థాయి అలాగే ఉండేది’ అని తెలిపారు. ‘భగవంతుడు నాకిచ్చిన జీవితంలో నా శక్తిసామర్థ్యాలను పూర్తిగా వినియోగించుని పని చేస్తాను. అన్ని పనులను సంపూర్ణంగా చేశాను. నటుడిగానూ అలాగే సంపూర్ణంగా పనిచేశాను. రాజకీయాల్లోనూ ప్రతికూల పవనాలు ఉన్పప్పుడే నేను రాజకీయాల్లో అడుగు పెట్టాను’ అని చెప్పారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/