జనాల్లోకి వెళ్లబోతున్న జగన్

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..చాల నెలల తర్వాత జగన్ క్షేత్రస్థాయి పర్యటనలకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ నుంచి మళ్లీ తాను ప్రజల్లోకి వెళతానని జగన్ వెల్లడించారు. బుధవారం జరిగిన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు క్రమం తప్పకుండా గ్రామ సచివాలయాలను సందర్శించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చాలా ముఖ్యమని జగన్ తెలిపారు.

ఈ విషయంలో అలసత్వం వహించే వారిపై చర్యలకు ఏ మాత్రం వెనకాడబోమని అధికారులను హెచ్చరించారు. ఎమ్మెల్యేలు సైతం వచ్చే నెల నుంచి వారానికి నాలుగు గ్రామ సచివాలయాలు సందర్శించాలని జగన్ ఆదేశించారు. వచ్చే ఏడాది నుంచి ప్రశాంత్ కిశోర్ టీమ్ రంగంలోకి దిగుతుందని కొద్దిరోజుల క్రితమే మంత్రులకు చెప్పిన సీఎం జగన్.. ఇప్పటి నుంచే వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం సిద్ధం కావాలని సూచించారు.