షర్మిల..డబ్బులిచ్చి కార్యకర్తలను తెచ్చుకుంటుందా..?

షర్మిల..డబ్బులిచ్చి కార్యకర్తలను తెచ్చుకుంటుందా..?
ys-sharmila-deeksha-on-unemployment

తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకురావాలనే లక్ష్యం తో షర్మిల పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణ నిరుద్యోగుల సమస్యలే పార్టీ ప్రధాన ఎజెండా గా ముందుకు వెళ్తున్నారు. ప్రతి మంగళవారం రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట దీక్ష చేపడుతూ వస్తున్నారు. ఈ దీక్ష కు పెద్ద సంఖ్యలోనే కార్య కర్తలు హాజరవుతూ వస్తుండడం తో ప్రజల్లోనూ షర్మిల ఫై నమ్మకం కలుగుతుంది. తాజాగా మాత్రం బోడుప్పల్లో జరిగిన సంఘటన తో షర్మిలది పెయిడ్ దీక్ష అని కామెంట్లు వస్తున్నాయి.

అసలు ఏంజరిగిందంటే..మంగళవారం మేడ్చల్ జిల్లా బోడుప్పల్లో ఆమె దీక్ష చేపట్టారు. ఇక్కడ గతంలో ఆత్మహత్య చేసుకున్న రవీందర్నాయక్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ క్రమంలోనే ఎగ్జిబిషన్ మైదానంలో షర్మిల నిరుద్యోగ దీక్ష చేపట్టారు. కానీ ఈ కార్యక్రమానికి పోలీసులు అడ్డుపడి ఆమెను లోటస్ పాండుకు తరలించారు. అయితే ఈ కార్యక్రమానికి మొదట కార్యకర్తలు పెద్దగా రాకపోయేసరికి.. ఆమె అనుచరులు కొందరు అడ్డాకూలీలను ఒక్కొక్కరికి రూ.400 చొప్పున ఇస్తామంటూ మాట్లాడుకుని తీసుకువవచ్చారు. ఇక దీక్ష జరగకపోవడంతో డబ్బులు ఇవ్వకుండా నాయకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో కూలీలు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా అయిపోయింది. అందరూ కూడా షర్మిలది పెయిడ్ దీక్ష అని కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు.