‘గే’ లను కూడా వదలని తాలిబన్లు..రేప్ చేసి చంపేశారు

'గే' లను కూడా వదలని తాలిబన్లు..రేప్ చేసి చంపేశారు

అఫ్గానిస్థాన్ ను ఆక్రమించుకున్న తాలిబన్లు ..రోజు రోజుకు రెచ్చిపోతున్నారు. వారికీ ఇక తిరుగులేకపోవడం తో వారు చేసిందే న్యాయం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎంతోమందిని బలి తీసుకున్న వీరు..ఆఖరికి ‘గే’ లను కూడా వదలడం లేదు. అఫ్గానిస్థాన్ ను వదిలి వెళ్లాలన్న ఓ స్వలింగ సంపర్కుని అతి దారుణంగా కొట్టి…రేప్ చేసి చంపేశారు.

వివరాల్లోకి వెళ్తే..

సదరు స్వలింగ సంపర్కుడు అఫ్గానిస్థాన్ వదిలి వెళ్లేందుకు సోషల్ మీడియా లో ఒకరి సాయం కోరాడు. అయితే అవతలి వ్యక్తి డైరెక్ట్ గా కలవమని చెప్పడం తో అతడి దగ్గరికి వెళ్లాడు. కానీ ఆ మనిషి తాలిబన్ మనిషేనని తెలుకోలేకపోయాడు. అక్కడికి చేరుకున్న తర్వాత ఇద్దరు తాలిబన్లు అతని ఫై దాడి చేసి..చివరకు రేప్ చేసి చంపేశారు. ఈ ఘటన తో దీంతో అక్కడి స్వలింగ సంపర్కులు హడలెత్తిపోతున్నారు. ఈ ఘటనపై అఫ్గాన్​కు చెందిన ఎల్​జీబీటీ హక్కుల ఉద్యమకారుడు ఆర్టెమిస్ అక్బరీ తీవ్రంగా మండిపడ్డారు. మరోవైపు రెయిన్​బో రైల్​రోడ్ అనే చారిటీ.. అఫ్గాన్ నుంచి బయటకు రావాలనుకుంటున్న స్వలింగ సంపర్కులకు సాయం చేస్తోంది. దాదాపు 200 మంది దేశాన్ని విడిచిపెట్టాలని భావిస్తున్నట్లు తెలిపింది. మరి వీరిని ఆ చారిటీ..అఫ్గాన్ ను దాటిస్తుందో లేదో చూడాలి.