మునుగోడు ఉపఎన్నిక బీజేపీ ఇంఛార్జ్‌గా వివేక్ వెంకటస్వామి

మునుగోడు ఉపఎన్నిక బీజేపీ ఇంఛార్జ్‌గా వివేక్ వెంకటస్వామిని అధిష్టానం ఖరారు చేసింది. శనివారం రాష్ట్ర
పార్టీ కార్యాలయంలో మునుగోడు ఉప ఎన్నికపై స్టీరింగ్ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పార్టీ కీలక నేతలు ఈటల రాజేందర్, వివేక్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజ్ఞప్తి మేరకు మునుగోడు ఉపఎన్నిక బీజేపీ ఇంఛార్జ్‌గా వివేక్ వెంకటస్వామిని నియమించినట్లు సమాచారం. వివేక్ నే ఇంచార్జ్ గా రాజగోపాల్ కోరడం వెనుక ప్రచారానికి సంబంధించిన మీడియా కవరేజ్ మెరుగ్గా ఉంటుందని రాజగోపాల్ రెడ్డి భావించినట్లు చెపుతున్నారు.

తెలంగాణ ప్రాంతంలో కీలక నేతగా ఉన్న వివేక్ వెంకటస్వామి ఓ టీవీ ఛానెల్, వార్తాపత్రిక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వివేక్ వెంకటస్వామి.. మునుగోడు ఇంఛార్జ్‌గా ఉంటే ఈ అవకాశాన్ని మరింత మెరుగ్గా ఉపయోగించుకునే వీలుంటుందని భావించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయణ్ని ఇంఛార్జ్‌గా ఇవ్వాల్సిందిగా కోరినట్లు సమాచారం. ఇక మునుగోడు ఉప ఎన్నికను బిజెపి ఎంతో ప్రతిష్ట్మాకంగా తీసుకుంది. ఎలాగైనా ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ను ఓడించాలని పక్క ప్రణాళికలతో ముందుకు వెళ్తుంది. అలాగే నియోజకవర్గంలోను ప్రతి రోజు పెద్ద ఎత్తున బిజెపిలోకి కార్యకర్తలు చేరుతుండడం పార్టీ కి మరింత బలంగా మారుతుంది.