నాగార్జున ” ది ఘోోస్ట్ ” సెన్సార్ పూర్తి..

కింగ్ నాగార్జున, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’. దసరా కానుకగా అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ సెన్సార్ కార్య క్రమాలను పూర్తి చేసుకుంది సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.

నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సునీల్ నారంగ్ తో కలసి పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే చిత్రానికి మార్క్ కె రాబిన్ సంగీత దర్శకుడు కాగ, భరత్, సౌరబ్ ద్వయం పాటలు అందించారు. ముఖేష్ జి సినిమాటోగ్రఫర్ గా, బ్రహ్మకడలి ఆర్ట్ డైరెక్టర్ గా, దినేష్ సుబ్బరాయన్, కేచ్ స్టంట్ మాస్టర్స్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.