దీపావళి కానుకగా ఆచార్య నుండి నీలాంబరి సాంగ్ విడుదల

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కి్స్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కేమియో రోల్‌లో నటిస్తుండగా..ఆయనకు జోడి గా పూజా హగ్దే నటిస్తుంది.

ఈ తరుణంలో వీరిద్దరి ఫై చిత్రీకరించిన సాంగ్ ను విడుదల చేయబోతున్నారు చిత్ర యూనిట్. దీపావళి కానుకగా చిత్రంలోని నీలాంబరి అనే సాంగ్ ను ఈ నెల 5వ తేదీన ఉదయం 11:07 నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో సిద్ధా పాత్రలో చరణ్ .. ‘నీలాంబరి’ పాత్రలో పూజ కనిపించనున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గా వచ్చిన ‘లాహే లాహే’ సాంగ్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట జనంలోకి దూసుకుపోయింది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది. మరి ఆ సాంగ్ ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.