హుజురాబాద్ ఓట్లపైనే కేసీఆర్ కు ప్రేమ

హైదరాబాద్ : బీజేపీ నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ గురువారం అపోలో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..ఉద్యమ ద్రోహులకు సీఎం కేసీఆర్ పట్టం కట్టారని విమర్శించారు. గతంలోనే తనను ఓడించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. రాళ్లేసిన వారికి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారని, హుజూరాబాద్‌లో ఇప్పటికే రూ.150 కోట్లు ఖర్చు చేశారని ఆయన అన్నారు.

టీఆర్ఎస్‌కు చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందన్నారు. కేసీఆర్‌కు ప్రజలపై ప్రేమ కంటే.. ఓట్లపై ప్రేమ ఎక్కువని, ఓట్ల కోసం మూడేళ్ల ముందు ఇచ్చిన హామీలను ఇప్పుడు నెరవేరుస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌కు ఓట్ల మీద ప్రేమ లేకపోతే.. హుజూరాబాద్‌లో అమలు చేస్తున్న పథకాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/