హరీష్ రావు దత్తత గ్రామంలోనూ కమల వికాసం

చరిత్ర సృష్టించిన బీజేపీ

BJP
BJP

Hyderabad: దుబ్బాక దంగల్‌లో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టించింది. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లోని ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహించిన గ్రామాల్లో సైతం బీజేపీనే పైచేయి సాధించి సంచలనం సృష్టించింది.

ట్రబుల్‌ షూటర్‌గా, ఉపఎన్నికల కింగ్‌గా పేరు గాంచిన మంత్రి హరీష్‌ రావు దత్తత గ్రామంలో సైతం బీజేపీ ఆధిక్యం కనబరిచింది.

హరీష్‌ రావు దత్తత గ్రామమైన చీకోడులో బీజేపీ 22 ఓట్ల ఆధిక్యం సాధించి మంత్రికే షాక్ ఇచ్చింది.

జరిగిన ఎనిమిది రౌండ్ల కౌంటింగ్‌లో రెండు రౌండ్లు మినహా అన్ని రౌండ్లలోనూ బీజేపీ మెజార్టీ సాధిస్తూ వచ్చింది.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/