దుబ్బాకలో ఆశించిన ఫలితం రాలేదు

నాయకులకు ఇదో హెచ్చరిక: కెటిఆర్

KTR
KTR

Hyderabad: దుబ్బాక ఉప ఎన్నికలలో ఆశించిన ఫలితం రాలేదని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

గత ఆరున్నరేళ్లుగా ప్రతి ఎన్నికలలో తెరాస విజయాలు సాధిస్తూ వచ్చిందన్న ఆయన విజయాలతో పొంగిపోవడం, ఓటమితో కుంగిపోవడం టీఆర్ఎస్ కు అలవాటు లేదని కేటీఆర్ అన్నారు.

తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడిన ఆయన దుబ్బాకలో టీఆర్ఎస్ కు ఓటు వేసిన 61,320 మంది ఓటర్లకు ధన్యవాదాలు  తెలిపారు. 

టీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఏమిటనే దానిపై  సమీక్షించుకుంటామన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగుతామని కేటీఆర్రు అన్నారు.

దుబ్బాక ఓటర్ల   తీర్పును గౌరవిస్తున్నామని, శిరసావహిస్తున్నామని అన్నారు. ఈ ఫలితం పార్టీ నేతలందరికీ ఒక హెచ్చరిక అని చెప్పారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/